Reading Time: < 1 minute

భూ వివాదంపై  ప్రధానిని కలిసిన స్కూల్‌‌ మేట్

Caption of Image.
  • సీబీఐ విచారణ జరిపించాలని మోదీకి విజ్ఞప్తి

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీని ఆయన చిన్ననాటి స్కూల్‌‌‌‌‌మేట్‌‌ కలిశారు. గుజరాత్‌‌లోని వద్‌‌నగర్‌‌లోని బీఎన్ స్కూల్‌‌లో మోదీతో కలిసి చదువుకున్న అస్గర్ అలీవోరా(81) తన భూ వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ నెల 8న నేరుగా పీఎంను కలిశారు. వివాదంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ముంబైలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన అస్గర్ అలీ వోరా.. భాయందర్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న రూ.కోట్ల విలువైన భూమి కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

ఈస్ట్‌‌లోని నవఘర్ ప్రాంతంలో 1989లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా వోరా కొనుగోలు చేశారు. 2011లో స్వయం బిల్డర్స్, సెవెన్ ఎలెవన్ కన్‌‌స్ట్రక్షన్స్ సంస్థలు ఆ భూమిని కబ్జా చేశాయని ఆరోపించారు. 2015లో పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రధానితో వోరా భేటీ కావడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.

©️ VIL Media Pvt Ltd.