Reading Time: < 1 minute

హ్యాపీ జర్నీ సినిమాకి ప్రేక్షకులే హీరోలు

Caption of Image.

మహిళా భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించారు. సె ప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. 

తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అభిరామ్ నాయుడు మాట్లాడుతూ ‘మన పేరెంట్స్ మీద మనకి చాలా ప్రేమ ఉంటుంది. కాకపోతే దాన్ని చూపించు కునే విధానం చాలా తక్కువ. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఇందులో చూపిస్తాం. ఇది మన అందరి కథ. 

ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో ఎమోషన్తో పాటు హ్యూమర్ కూడా ఉంటుందని, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ చిత్రమని పాయల్ రాధాకృష్ణచెప్పింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నటీనటులు పృథ్వీ, వంశీ, రవి శివతేజ, సునయన, జినీషా. రూప అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.