Reading Time: < 1 minute
Jailer 2 Telugu Rights Sun Pictures Demands %e2%82%b955 Cr Naga Vamsi Dil Raju In Race

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్-2 రైట్స్ కు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 45 కోట్ల దాకా రికార్డు స్థాయి షేర్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం బడా నిర్మాతలైన దిల్ రాజు, నాగంవంశీ మధ్య పోటీ నెలకొంది. సితార నాగవంశీ ఈ హక్కుల కోసం రూ. 45 కోట్లు + GST చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. గతేడాది రజనీకాంత్ ‘కూలీ’ సినిమాను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆయన ‘వార్ 2’ ప్రాజెక్ట్‌ కోసం వెనక్కి తగ్గారు. ఇప్పుడు ‘జైలర్ 2’ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇక మరోవైపు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  రూ. 30 కోట్లు + జీఎస్టీ  ఆఫర్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే చిత్ర నిర్మాత సన్ పిచ్చర్స్ డిమాండ్ మరోలా ఉంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ ఏకంగా రూ. 55 కోట్లు + GST  డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం రూ. 45 కోట్ల రికార్డు షేర్ రాబట్టడంతో సన్ పిక్చర్స్ తమ డిమాండ్ విషయంలో పట్టుదలతో ఉండగా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మార్కెట్ రిస్క్‌ను బేరీజు వేసుకుంటున్నారు. మరి సన్ పిక్చర్స్ డిమాండ్‌కు తలొగ్గి ఎవరు ఈ ప్రతిష్టాత్మక హక్కులను దక్కించుకుంటారోనని ట్రేడ్ వర్గాలలో కూడా ఆసక్తి నెలకొంది. సీక్వెల్ హైప్ తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచింది. దసరా లాంగ్ వీకెండ్ సీక్వెల్ హైప్ సూపర్ స్టార్ మానియాతో జైలర్ 2 భారీ ఓపెనింగ్ ఉండబోతుందనడంలో సందేహమే లేధు. మరి దిల్ రాజు – నాగవంశీ ఇద్దరిలో ఎవరు సూపర్ స్టార్ సినిమా రైట్స్ దక్కించుకుంటారో చూడాలి.