వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉద్యోగ స్థానాధిపతి శని సంచారం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవ కాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొద్ది కాలంగా కొనసాగుతున్న స్తబ్దత తొలగిపోయే సూచనలున్నాయి. జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతులు లభించడానికి, కొత్త సవాళ్లను ఎదు ర్కోవడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. త్వరలో సవాళ్లతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
కర్కాటకం: ఈ రాశిలోకి ఈ నెల 18న దశమాధిపతి కుజుడు ప్రవేశించబోతున్నందువల్ల ఉద్యోగంలో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగంలోకి తప్పకుండా మారడం జరుగుతుంది. విదేశీ అవకాశాలు లభించడంతో పాటు ఉద్యోగరీత్యా విదేశీ పర్యటనలకు బాగా అవకాశం ఉంది.
కన్య: ఈ రాశికి ప్రస్తుతం దశమాధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అతి త్వరలో ఉద్యోగం మార డానికి, ఉద్యోగంలో మరింత పురోగతి చెందడానికి అవకాశం ఉంది. గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీతభత్యాలు అంచనాలను మించి పెరగడానికి, పదోన్నతు లకు బాగా అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో పదోన్నతితో పాటు శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి ఉద్యోగంలో మరింత ఉన్నత పదవి లభిస్తుంది.
తుల: ఈ రాశికి దశమ స్థానం శుభ గ్రహాలతో ఉండడంతో పాటు, రాశ్యధిపతి శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన చలనానికి, ఒక విభాగానికి అధిపతి కావడానికి బాగా అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ రీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.
వృశ్చికం: రాశినాథుడు కుజుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉండడం, లాభ స్థానంలో బుదుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు బాగా ఉచ్ఛ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరికి త్వరలో మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ నెల చివరి లోగా ఒక సంస్థలో ఉన్నతాధికారి అవుతారు.
మకరం: ఈ రాశికి సప్తమంలో ఉచ్ఛ స్థితిలో గురువు, భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో బుధుడు, దశమంలో స్వస్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ నెల 15 నుంచి ఈ రాశివారికి ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందు తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా బిజీగాసాగుతాయి.





