
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేండ్లు, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ లాసెట్, పీజీఎల్‌సెట్–2026 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజైంది. గత రెండు విడతల్లో నమోదు చేసుకోని అభ్యర్థులు ఈనెల 15 నుంచి 17 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, 18న అర్హుల జాబితా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈనెల19 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, 25న సీట్ల అలాట్‌మెంట్ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 29లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. రెండు విడుతల్లో సీట్లు పొంది.. క్యాన్సిల్ చేసుకున్న వారు ఈ చివరి విడత వెబ్ ఆప్షన్లకు అనర్హులని పేర్కొన్నారు.