
ఖైరతాబాద్ మహాగణపతిది 72 ఏళ్ల ప్రస్థానం అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2026 సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా బడా గణేష్ తొలిపూజలో పాల్గొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయా రెడ్డి స్థానిక నేతలు, వేలాది భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. గణపతి తొలిపూజకు సంబంధించి క్యూర్ ఏరియాలో భారీగా భారీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నిర్వహణకు సంబంధించి కమిటీలతో రెండు సార్లు మీటింగ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గత మూడేళ్లుగా మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని అన్నారు. ఉత్సవాలు సక్రమంగా సాగాలంటే భక్తుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు.
ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని.. ఇప్పుడు గణపతిని కూడా రాష్ట్రంలో సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడున్న విపత్తును ఎదుర్కొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.