వినాయక చవితి పండుగ రోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమయ్యాయి. గంటల్లోనే ఉన్నట్లుండి కుప్పకూలాయి. వరుసగా రెండో రోజు ధరలు పడిపోయాయి. పండుగ పూట ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. వచ్చే నెలలో దసరా పండుగ కూడా రానున్న క్రమంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. ఈ పతనం తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కి చేరుకోగా.. సోమవారం ఒక్కరోజే రూ.490 డౌన్ అయింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,250 వద్ద కొనసాగుతుండగా.. ఈ రోజు రూ.450 క్రాష్ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,250కు లభిస్తున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల క్యారెట్ల రేట్లు రూ.1,54,090 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,240 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,400 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో కిలో సిల్వర్ రేటు రూ.2.50 లక్షలుగా ఉంది.
చెన్నైలో కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ప్రభావితం అవుతున్నాయి. ఈ అంచనాల వల్ల డాలర్, బాండ్ ఈల్డ్స్కి గిరాకీ పెరిగింది. దీంతో బంగారం ధరల తగ్గుతూ వస్తోంది.




