
ఘాటీ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ ప్రకటించలేదు. అయితే ఘాటీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడు మాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు తేలింది. ‘కథనార్: ది వైల్డ్ సార్సర్’ అనే భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. జయసూర్య, మోహన్ లాల్, ప్రభుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించగా, ఫీమేల్ లీడ్ లో అనుష్క కనిపించనుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రోజీని థామస్ తెరకెక్కిస్తున్నారు. అనుష్కకు మాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే అనుష్క మరో ఛాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతోంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు షైజు ఖలీద్ అమ్మడిని ఓ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదొక యూత్ ఎంటర్‌టైనర్. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తోంది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుందట. కథనార్ రిలీజ్‌కు ముందే అనుష్కకు రెండవ సినిమా అవకాశం రావడం విశేషం. మొత్తానికి తెలుగు, తమిళ సినిమాలకు దూరమైనా మాలీవుడ్‌లో మాత్రం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.