
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భం దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ప్రముఖ బోర్డులు, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ప్రముఖ జట్లు సోషల్ మీడియా వేదికగా సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మైదానంలో తనదైన శైలిలో నూతన షాట్లు ఆడుతూ ‘మిస్టర్ 360 డిగ్రీస్’గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందుకున్నారు. ఇప్పటివరకు 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆయన 4,000లకు పైగా పరుగులు సాధించారు. 2022 అక్టోబర్‌లో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆయన, 2023 జనవరిలో 910 రేటింగ్ పాయింట్లను సాధించి ఈ ఫార్మాట్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. అంతేకాకుండా 2022, 2023 సంవత్సరాలకు గాను వరుసగా రెండుసార్లు ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు.
1⃣5⃣1⃣ Int’l matches
4⃣0⃣5⃣3⃣ Int’l runsICC Men’s T20 WC 2024 winner
Winning Captain of ICC Men’s T20 WC 2026Here’s wishing the innovative & flamboyant @surya_14kumar a very Happy Birthday
#TeamIndia https://t.co/8sXKVJD5Hd
— BCCI (@BCCI) September 14, 2026
Aaj apne Surya दादा ka budday hai!
Sab log jaldi se replies mein wishes daal do!
https://t.co/710cTfGum2
— Mumbai Indians (@mipaltan) September 14, 2026
భారత్ గెలుచుకున్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సూర్య పాత్ర మరువలేనిది. 2024లో టీమిండియా సాధించిన టీ20 ప్రపంచ కప్ విజయంతో పాటు, ఆయన కెప్టెన్సీలో భారత్ 2026 టీ20 ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. తద్వారా టీ20 ప్రపంచ కప్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్న మొట్టమొదటి జట్టుగా భారత్ నిలవడంలో సూర్య నాయకత్వ ప్రతిభ కీలకమైంది. అలాగే ఆయన సారథ్యంలోనే 2025లో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ఆసియా కప్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది.
The man with a smile, always
Happy birthday to everyone’s favourite, Surya!#WhistlePodu #Yellove https://t.co/6LC8EaUgIh
— Chennai Super Kings (@ChennaiIPL) September 14, 2026
సూర్య జన్మదినం సందర్భంగా బీసీసీఐ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “151 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 4053 పరుగులు, 2024 టీ20 ప్రపంచ కప్ విజేత, 2026 టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్. వినూత్న శైలిలో బ్యాటింగ్ చేసే సూర్యకుమార్ యాదవ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ కొనియాడింది. అలాగే ఐపీఎల్‌లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రత్యేక సందేశాన్ని పంచుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా స్పందిస్తూ.. “ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వ్యక్తి, అందరి ఫేవరెట్ అయిన సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని తెలిపింది. దూకుడుగా ఆడుతూ, వినూత్న షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురిచేసే సూర్యకుమార్ యాదవ్ మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.





https://t.co/710cTfGum2