
బెంగళూరు: బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రం కంప్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కంప్లి ప్రాంతంలోని ఓ గ్రామంలో పాఠశాలకు అతిథిగా ఉపాధ్యాయుడు వచ్చాడు. తన ఇల్లును శుభ్రం చేయాలని ఓ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్ద అళ్లళ్లి వీరేశ్ మాట్లాడారు. సక్రమంగా విధులు నిర్వహించని ఉపాధ్యాయులను బదిలీచేయడంతో పాటు అతిథి ఉాపాధ్యాయులకు బదులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.