Reading Time: < 1 minute

వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మర్రి ఆకుపై సూక్ష్మ గణపతి..

Caption of Image.

నర్సంపేట, వెలుగు : వటపత్ర గణపతికి ఉండ్రాళ్ల నైవేద్యం అంటూ వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌, పర్యావరణ ప్రేమికుడు శ్రీరామోజు జయకుమార్‌‌‌‌‌‌‌‌ 2 సెంటీమీటర్ల సూక్ష్మ బాల గణపతిని తయారు చేసి మర్రి ఆకుపై ఉంచి ఉండ్రాళ్లు సమర్పించారు. 

 18 ఏండ్లుగా పర్యావరణ పరిరక్షణ, మట్టి గణపతులపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏటా విభిన్న సూక్ష్మ గణపతులను రూపొందిస్తున్న జయకుమార్‌‌‌‌‌‌‌‌ ఈసారి వటపత్రంపై బాల గణపతిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు.   

©️ VIL Media Pvt Ltd.