Reading Time: 2 minutes
Ram Charan Chiranjeevi Vinayaka Chavithi Mega Family Ganesh Puja Viral Video

Ram Charan: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను కొలిచిన ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పవిత్ర పండుగ వేళ రామ్ చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భార్య ఉపాసన కొణిదెల, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

“ఆ విఘ్నేశ్వరుడు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సులను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు” అంటూ రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకేచోట చేరి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్న ఈ ప్రత్యేక వీడియోను చరణ్ షేర్ చేయడంతో, క్షణాల్లోనే అది నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ #RC17. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.