
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదలతో స్టాక్ మార్కెట్లు గత వారం 2శాతం పైగా నష్టపోయినప్పటికీ.. ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ వారం 5 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్లు ముందుకు రానుండగా, దాదాపు రూ.24,328 కోట్లు సేకరించనున్నాయి.
- 1) అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఈ రూ.22,561 కోట్ల ఐపీఓ సెప్టెంబర్ 17న ప్రారంభమై 21న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ రూ.1,700–రూ.1,785. యాంకర్ బుక్ సెప్టెంబర్ 16న ఓపెన్ కానుండగా, ఎల్‌ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.
- 2) ఓపీ ముంజాల్ గ్రూప్‌నకు చెందిన ఆటో విడిభాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్లు సేకరించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ రూ.79–రూ.84.
- 3) ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ ‘ఎస్ఎస్ రిటైల్’ (రూ.500 కోట్లు), ‘జిందాల్ సుప్రీమ్’ (రూ.125 కోట్లు) ఐపీఓలు సెప్టెంబర్ 16న.. టెక్స్‌టైల్ సంస్థ ‘సోనాసెలక్షన్ ఇండియా’ (రూ.141 కోట్లు) సెప్టెంబర్ 17న సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఎస్‌ఎస్ రిటైల్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.403–424 కాగా, జిందాల్ సుప్రీమ్ ఐపీఓ ధర రూ.88–93. సోనా సెలక్షన్ ప్రైస్ బ్యాండ్ రూ.94–99.