Reading Time: < 1 minute

యూఎ స్ ఓపెన్ క్వీన్ రిబాకినా.. ఫైనల్లో సబలెంకాపై సంచలన విజయం

Caption of Image.

 కెరీర్‌‌‌‌లో మూడో గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టైటిల్‌‌‌‌
 వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌గా కజకిస్థాన్‌‌‌‌ స్టార్‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌: కజకిస్థాన్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌‌‌ ఎలెనా రిబాకినా యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచింది. హైఓల్టేజ్‌‌‌‌ ఫైనల్లో రెండుసార్లు డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ అరీనా సబలెంకాను 6–4, 5–7, 6–2తో ఓడించి తొలిసారి యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను ముద్దాడింది. ఈ విజయంతో రిబాకినా వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను కూడా సొంతం చేసుకుంది. 

2022 వింబుల్డన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ రిబాకినాకు కెరీర్‌‌‌‌లో ఇది మూడో గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ టైటిల్‌‌‌‌. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ ఫైనల్లోనూ సబలెంకానే ఓడించి ట్రోఫీ గెలిచింది. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌కు పది రోజుల ముందు పాదం గాయంతో ఇబ్బందిపడిన రిబాకినా.. వారం పాటు ప్రాక్టీస్‌‌‌‌ కూడా చేయలేకపోయింది. అయినా టోర్నీలో ఏడు మ్యాచ్‌‌‌‌లూ గెలిచి సత్తాచాటింది.  

మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 27 ఏండ్ల రిబాకినా.. ఏస్‌‌‌‌తో చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను ముగించింది. ‘‘యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌, నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ సాధించడం ప్రత్యేకం’’ అని రిబాకినా తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.