Reading Time: 2 minutes

బుద్ది ఉన్నోడెవడూ అక్కడ పనిచేయడు.. ఉద్యోగాలకు ఢిల్లీ కంటే హైదరాబాద్ బెటర్.. టెకీ వీడియో వైరల్ 

Caption of Image.

దేశంలోని టెకీల చూపంతా హైదరాబాద్ వైపే..ఉద్యోగం చేయాలన్నా, ప్రశాంతంగా జీవించాలన్నా, ఖర్చులు తగ్గించుకోవాలన్నా.. నాలుగు పైసలు సంపాదించుకోవాలన్నా ఈ మెట్రో నగరం బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. అంతేకాదు దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువేనని చెబుతున్నారు.  గురుగ్రామ్ లోపనిచేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ టెకీ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇదే చెబుతోంది.. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆ టెకీ చేసిన కామెంట్స్ తో హైదరాబాద్ సిటీ  లివింగ్ కాస్ట్ పై మరోసారి చర్చకు వచ్చింది.  

ఇన్ స్టాగ్రామ్ లో హాషిర్ అనే యూజర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగాల కోసం సిటీల్లో బెస్ట్ ఎంపిక ఏదీ అనే ప్రశ్న తలెత్తినప్పుడు అతను చేసిన కామెంట్స్ నెటిజన్లలో చర్చనీయాంశమయ్యాయి. దేశంలో ప్రధాన నగరాల్లో ఏ బెటర్ అంటే అతను చెప్పిన సమాధానం ఉత్తమమైనది మన హైదరాబాద్..ఇది జీవన శైలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో బెస్ట్ వన్ అని చెప్పడంపై మన మెట్రోనగరం డెవెలప్ మెంట్ పై చర్చకు దారి తీసింది. 

మనదేశంలో ఉద్యోగాల కోసం చూస్తున్న టెక్ నిపుణులకు గుర్గావ్ , హైదరాబాద్ , బెంగళూరు అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్షు గా ఎంచుకుంటున్నారు. బెంగళూరు దాని టెక్నాలజీ పరిశ్రమ , వాతావరణానికి ప్రసిద్ధి చెందగా, హైదరాబాద్ దాని జీవనశైలి , తక్కువ ఖర్చుతో కూడిన జీవన వ్యయానికి బెస్ట్ వన్ ప్రశంసించబడుతుంది. మరోవైపు  గుర్గావ్ అనేక కార్పొరేట్ , టెక్ ఉద్యోగాలను, అలాగే ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా మంచి కనెక్టివిటీని అందిస్తుందిస్తున్పప్పటికీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ యూజర్ హషీర్ అనే ఓ టెకీ, తాను పని కోసం గుర్గావ్‌కు బదులుగా హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నాడో వివరించిన తర్వాత ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. 

గుర్గావ్, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్,నోయిడాలు వేదన, నిరాశల ఐదుగురు అక్కా చెల్లెండ్లు అంటూ కామెంట్ చేశాడు.అంతేకాదు ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో బెంగళూరు, గురుగ్రాం, హైదరాబాద్ లలో తన ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఇందులో హైదరాబాద్ బెస్ట్ వన్ అని రాశారు.  హైదరాబాద్  నివసించేందుకు అనువైన ప్రాంతం.. తెలివైన వాడెవ్వడూ  బెంగళూరు, హైదరాబాద్ లను వదిలి గురుగ్రామ్ ను ఎందుకు ఎంచుకుంటాడు అని ప్రశ్నించాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ ..భాయ్, మీ పరిస్థితి చూస్తే జాలిగా ఉంది. మీ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను – అలా జరగకపోవచ్చు, జరగొచ్చు.. అని వీడియోను ముగించాడు, వీడియోతో పాటు ఉన్న క్యాప్షన్‌లో, తాను ఏ నగరాన్నీ ద్వేషించడం లేదని హషీర్ స్పష్టం చేశాడు. 

సోషల్ మీడియా పెద్ద చర్చ .. 

ఈ వీడియో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. గుర్గావ్, హైదరాబాద్ ,బెంగళూరులో నివసించిన తమ అనుభవాలను పంచుకున్నారు. 

ఆ పోస్ట్‌పై స్పందిస్తూ, ఒక యూజర్ ఇలా రాశారు, పని చేయడానికి పూణే, బెంగళూరు, హైదరాబాద్ అనే మూడు నగరాలు మాత్రమే ఉన్నాయి. అంతే. మీరు చాలా ధనవంతులైతే ముంబైలో పని చేయవచ్చు. కామెంట్ చేశాడు. 

మరో యూజర్ స్పందిస్తూ..  బెంగళూరులో నివసించే వ్యక్తిగా చెబుతున్నాను, గురుగ్రామ్ చాలా మంచిది బ్రో. బెంగళూరులో వాతావరణం తప్ప మరేమీ లేదు. అయితే గురుగ్రామ్ కంటే హైదరాబాద్ మంచిది. అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

‘‘యూపీలో స్వస్థలం ఉండి, తరచుగా ప్రయాణించాల్సి వచ్చే నా లాంటి వాళ్ళు ఎప్పుడూ గురుగ్రామ్/నోయిడాకు వెళ్తారు. నేను బెంగళూరులో ఉంటున్నాను, సాధారణ రోజుల్లో విమానాశ్రయానికి చేరుకోవడానికి రెండున్నర-మూడు గంటల సమయం పడుతుంది. కనీసం ఢిల్లీలోనైనా ఎయిర్ పోర్టుకి , రైల్వే స్టేషన్లకు మెట్రో కనెక్టివిటీ ఉంది’’అని మూడో యూజర్ రాశారు.

మరొక యూజర్ స్పందిస్తూ .. “గుర్గావ్ నాకు క్లినికల్ డిప్రెషన్‌ను కలిగించింది, డాక్టర్ నాకు మూడుకు పైగా మందులు ఇచ్చారు. ఆకలి కూడా తగ్గిపోయింది. ఉద్యోగం మానేసి ఇంటికి తిరిగి వచ్చాను” అని తన అనుభవాన్ని పంచుకున్నారు. 

ఇలా  దేశంలోన ప్రధాన నగరాల్లో జీవన శైలీ,  జీవన వ్యయం , సౌకర్యాల వంటి అంశాలపై నెటిజన్లు తమ ఆందోళనను  వ్యక్తం చేశారు.  పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విస్తరిస్తున్న నగరాల్లో  మౌలిక సదుపాయాలు, ఎయిర్ క్వాలిటీ, పరిశుభ్రత, లైఫ్ స్టైల్, లివింగ్ కాస్ట్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాల్లో నివసించేందుకు ప్రజలు ఇష్టపడుతున్న క్రమంలో హైదరాబాద్ మరింత ఎదుగుతోందని ఈ ఘటన మనకు తెలియజేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.