
ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘హనుమాన్ అంశ్’కు తొలిరోజుల్లో పెద్దగా స్పందన రాలేదు. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో సినిమాకు క్రమంగా ఆదరణ పెరిగింది. దీంతో థియేటర్లలో స్క్రీన్ల సంఖ్య కూడా పెరిగింది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లను రాబట్టింది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా భారత్‌లో రూ.214 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.268 కోట్లకు చేరుకున్నాయి. మరో రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. వేర్వేరు ట్రేడ్ ట్రాకర్ల లెక్కల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, రూ.2 కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే సినిమా సాధించిన వసూళ్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా విజయానికి భారీ యాక్షన్, స్టార్ హీరో ఇమేజ్ కంటే భక్తి, ఆధ్యాత్మికత, కథపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నమ్మకమే ప్రధాన కారణంగా నిలిచింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలోనూ విస్తరించడంతో కలెక్షన్స్ రోజురోజుకూ పెరిగాయి. కేవలం రూ.2 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తక్కువ బడ్జెట్ సినిమాలకు మంచి కథ, బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపించింది.
ప్రస్తుతం ఈ సినిమా 2026లో అత్యంత ప్రాఫిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్ సినిమాలకు పోటీగా నిలుస్తూ, తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డీల్ రూ. 100క్లొట్లకు క్లోజ్ అయ్యిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీని పై చిత్ర నిర్మాత అనుప్రియ నాగర్ స్పందిస్తూ ఆ వార్తలు అవాస్తవం అని ఖండించారు. సినిమా తెరకెక్కించేటప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి నేను కలలో కూడా ఆలోచించలేదు. నీమ్ కరోలి బాబా దివ్య సందేశాన్ని నేటి యువతరానికి అందించాలనేదే నా ఏకైక లక్ష్యం. నాకింకా 21 ఏళ్లే.. ఇంత భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఊహించలేదు, అసలు ఈ డబ్బును ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఈ భారీ లాభాలు ఇవి. వాటిని నిరుపేద పిల్లల విద్యాభ్యాసానికి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే పూర్తిగా వినియోగించాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.