Reading Time: < 1 minute

ట్రోఫీ కంటే దేశమే ముఖ్యం.. ఆసియా కప్ టైటిల్ వివాదంలో హార్మన్ సేనకు అండగా BCCI

Caption of Image.

న్యూఢిల్లీ: దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దు వివాదాల నేపథ్యంలో పాకిస్థాన్‎కు చెందిన ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు హార్మన్ సేన నిరాకరించింది. దీంతో ఈ విషయం వివాదస్పదంగా మారింది. ట్రోఫీ స్వీకరణ వివాదంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించిన హార్మన్ సేన నిర్ణయాన్ని బీసీసీఐ సమర్థించింది. 

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ఇష్యూపై మాట్లాడుతూ.. నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకూడదనే భారత మహిళల జట్టు నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు. భారత పురుషుల జట్టు కూడా గతంలో ఇదే కారణంతో ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించలేదని ఆయన గుర్తు చేశారు. 2025లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య అన్ని సంబంధాలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు.

దేశ పౌరుల మనోభావాలకు విలువనిస్తూ పాకిస్తాన్‎తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దన్న భారత ప్రభుత్వం, ప్రజల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోన్న నఖ్వీ  చేతుల మీదుగా మేం ట్రోఫీ అందుకోలేమని ఆయన స్పష్టం చేశారు. ట్రోఫీని అందుకోవడం కంటే టోర్నమెంట్‌ను గెలవడమే మాకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. 

►ALSO READ | యూఎ స్ ఓపెన్ క్వీన్ రిబాకినా.. ఫైనల్లో సబలెంకాపై సంచలన విజయం

అయితే, ఈ ప్రెజెంటేషన్ వేడుకకు సంబంధించి బీసీసీఐ తన వైఖరిని ముందే నిర్వాహకులకు స్పష్టం చేసిందని, ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్య దేశంగా అంతర్జాతీయ క్రీడా నిబంధనలకు కట్టుబడి టోర్నీలో పాకిస్తాన్ టీమ్‎తో మ్యాచ్ ఆడామని వివరణ ఇచ్చారు. మ్యాచ్ ఆడటం వేరు.. ట్రోఫీ స్వీకరించడం రెండు వేర్వేరు విషయాలని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.