
- వ్యక్తిగత జీవితంపై మాట్లాడేందుకు నిరాకరణ
న్యూఢిల్లీ: టీమిండియా విమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడేందుకు నిరాకరించింది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమెకు జీవితంలో అత్యంత కష్టమైన రాత్రి ఏదంటూ ప్రశ్న ఎదురైంది. దీంతో కొద్దిసేపు మౌనంగా ఉన్న మంధాన.. తన సంభాషణను క్రికెట్‌కే పరిమితం చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారని హోస్ట్ ప్రశ్నించగా మంధాన ఆసక్తికరంగా స్పందించింది. ‘‘నాకు గుర్తులేదు. సినిమాలు చూస్తే ఏడుస్తాను. కానీ నిజ జీవితంలో మాత్రం ఏడవను’’ అని చెప్పింది. ఇటీవల ‘ముసాఫిర్ కేఫ్’ సినిమా చూసినప్పుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు వచ్చినట్లు వెల్లడించింది. అయితే అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదని, సినిమా చూసి కలిగిన ఆనందకరమైన భావోద్వేగమని వివరించింది.