
మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ నెక్స్ ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఫాంటసీ యాక్షన్ డ్రామా. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ని తెరకెక్కిస్తున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్స్ చిరంజీవితో ఓ మూవీని రూపొందించనున్నాడు. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్కు బ్లడ్ షేడ్‌తో సాగే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా 1970 నేపథ్యంలో సాగే కథగా దీన్ని శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకురానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరు నుంచి ఓ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాని ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఆ కోరికని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో తీర్చనున్నాడని సమాచారం.