
బ్రిస్బేన్: మహిళల భారత జట్టు అస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టాస్ గెలిచి టీమిండియా మహిల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టి2 0 సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. గాయం నుంచి కోలుకొని ఓపెనర్ ప్రతికా రావల్ జట్టులోకి వచ్చారు. యువ బౌలర్ కాశ్వీ గౌతమ్ కూడా తుది జట్టులోకి అవకాశం లభించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్ష్ తో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.