Reading Time: < 1 minute

మాటలే తప్ప చేతలు కన్పించట్లేదు..సీఎం రేవంత్రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Caption of Image.

చేవెళ్ల, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి మాటలకే పరిమితమయ్యారే తప్ప చేతల్లో చూపడం లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుదనం కనబడడం లేదన్నారు. సోమవారం శంకర్​పల్లిలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీకి చెందిన 100 మంది బీఆర్ఎస్​లో చేరగా, ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు.  కేసీఆర్ హయాంలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందేవని, రియల్ ఎస్టేట్ రంగం కూడా కళకళలాడేదని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదని ఆరోపించారు. ఇదే వేదికపై శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బద్దం శశిధర్ రెడ్డిని ఆమె ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.