Reading Time: 2 minutes

వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి T20కి ప్లేయింగ్ XI ఇదే!

Caption of Image.

Vaibhav Sooryavanshi : వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌‌కు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో జరగనున్న ఈ సిరీస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియం B గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఇటీవల జపాన్ వేదికగా ముగిసిన 2026 ఆసియా క్రీడలలో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు స్వర్ణ పతకం సాధించి అజేయ ఊపు మీదుంది. ఆసియా గేమ్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఆడిన ఈ యువ జట్టు, ఇప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో విండీస్‌తో తలపడనుంది. వర్క్‌లోడ్ మేనేజ్‌‌మెంట్ కారణంగా పేస్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరంగా ఉంది. 

తొలి T20I కోసం పుజారా ప్లేయింగ్ XI ఇదే: 

* ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే తొలి T20 మ్యాచ్‌ కోసం టీమిండియా మాజీ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా స్టార్ స్పోర్ట్స్ కోసం తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పుజారా తన తుది జట్టు నుంచి పక్కన పెట్టి బెంచ్‌కే పరిమితం చేశారు.

* ఓపెనర్లుగా వికెట్ కీపర్ సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు పుజారా చోటు కల్పించారు. ఇక మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను ఎంచుకున్నారు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌లో తిలక్ వర్మ (5), శివమ్ దూబే (6), ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (7) స్థానం సంపాదించారు.

* స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కగా.. పేస్ అటాక్‌లో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు పుజారా తన తుది జట్టులో చోటు కల్పించలేకపోయాడు. 

* వెస్టిండీస్‌తో జరిగే తొలి T20 కోసం నా ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే: సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వస్తారు. నం.3లో ఇషాన్ కిషన్, నం.4లో శ్రేయస్ అయ్యర్, నం.5లో తిలక్ వర్మ, నం.6లో శివమ్ దూబే, నం.7లో నితీశ్ కుమార్ రెడ్డి, నం.8లో అక్షర్ పటేల్, నం.9లో కుల్దీప్ యాదవ్, నం.10గా అర్ష్‌దీప్ సింగ్, నం.11గా ప్రిన్స్ యాదవ్ ఉంటారని పుజారా పేర్కొన్నారు.

తొలి T20 ప్లేయింగ్ ఎలెవెన్:

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్. 

©️ VIL Media Pvt Ltd.