Reading Time: < 1 minute

Singeetham Srinivasa Rao: ‘సింగీతా’నికి ఇక సెలవు.. ముగిసిన లెజెండరీ దర్శకుడి అంత్యక్రియలు

Caption of Image.

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికారు. చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు అక్టోబర్ 3 రాత్రి చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో కన్నుమూశారు.

కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్తతో తెలుగు, తమిళంతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో సింగీతం ఎన్నో భాషల్లో విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలతో తనదైన ముద్ర వేశారు. ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘మైఖేల్ మదన కామరాజన్’ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

కన్నీటి వీడ్కోలు..

అంత్యక్రియలకు ముందు సింగీతం శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చెన్నైలోని విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సింగీతం భౌతికంగా దూరమైనా.. ఆయన సృష్టించిన సినిమాలు, ప్రయోగాలు, కథ చెప్పిన విధానం మాత్రం తరతరాల ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఓ లెజెండరీ దర్శకుడికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ.. ‘సింగీతా’నికి ఇక సెలవు అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.