పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే ప్రధాన రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి, జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కేలరీలు మరియు కొవ్వు త్వరగా కరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహజసిద్ధమైన ఫ్యాట్ బర్నర్గా పనిచేస్తుంది.
వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో పచ్చిమిర్చి సమర్థవంతంగా పనిచేస్తుంది. నిత్యం ఆహారంలో మితంగా పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పచ్చిమిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు..మధుమేహంతో బాధపడేవారికి పచ్చిమిర్చి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసి, రక్తపోటును నియంత్రించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి ఇది తోడ్పడుతుంది.
పచ్చిమిర్చి తినడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్ను ఉత్సాహంగా ఉంచుతాయి. అలాగే విటమిన్ సి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. పచ్చిమిర్చి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ, అతిగా తింటే కడుపులో మంట, అసిడిటీ లేదా అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజువారీ ఆహారంలో మితంగా తీసుకోవడమే శ్రేయస్కరం.




