Reading Time: < 1 minute

20 రూపాయల లంచం కేసు.. 30 ఏండ్ల తర్వాత తీర్పు

Caption of Image.
  • ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: రూ.20 లంచం ఆరోపణలతో మొదలైన న్యాయపోరాటం మూడు దశాబ్దాల తర్వాత ముగిసింది. గుజరాత్కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించిం ది. లంచం అడిగినట్లు నిరూపించకుండా.. రూ.20 నగదు దొరికిందన్న కారణంతోనే నిందితులను దోషులుగా తేల్చలేమని స్పష్టం చేసింది.

ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను కొట్టివేసింది. 1996లో ఆనంద్ జిల్లాలోని బెచారి పంచాయతీ కార్యాలయానికి ఓ విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం వెళ్లాడు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు క్లర్క్ రూ.120 డిమాండ్ చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపిం చింది. ఇందులో రూ.100 క్లర్కు.రూ.20ప్యూన్స్కు ఇవ్వాలని కోరినట్లు పేర్కొంది.

విద్యార్థి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. విద్యార్థి ప్యూన్కు రూ.20 ఇవ్వగా.. ఆ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్లర్క్ వద్ద రూ. 100 మాత్రం దొరకలేదు. విచారణలో ప్రా సిక్యూషన్ వాదనల్లో వైరుధ్యాలు ఉన్నాయని సుప్రీం కోర్టు గుర్తించింది. ప్యూన్ తనను లంచం అడగలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్లో అంగీకరించాడు.

సర్టి ఫికెట్ తీసుకున్న తర్వాతే రూ.20 ఇచ్చినట్లు కూడా తేలింది. లంచం డిమాండ్ చేసినట్లు నిరూపించకపో తే.. ప్యూన్ వద్ద రూ. 20 దొరికిందన్న కారణంతోనే కేసును నిర్ధారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మరుసటిరోజు ఈద్ ఉండడంతో విద్యార్థి ఆ మొత్తా న్ని ఇచ్చాడన్న ప్యూన్ వాదన కూడా సహేతుకమేనని పేర్కొంది. ఇద్దరు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటి స్తూ కేసును కొట్టివేసింది.

©️ VIL Media Pvt Ltd.