
తెలంగాణ ఇంటర్ బోర్డు ఆఫీసులో ఆకస్మిక సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు. బుధవారం ( ఆగస్టు 19 ) హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు ఆఫీసులో సోదాలు నిర్వహించిన అధికారులు 2019 ఇంటర్ ఫలితాల గందరగోళంపై విచారణ చేపట్టారు. గ్లోబరీనా కంపెనీ టెండర్ ప్రక్రియపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి మాజీ ఇంటర్ సెక్రెటరీ అశోక్ ను విచారించారు అధికారులు.
గ్లోబరీనా సంస్థల ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. ఇటీవల నీట్ ఫలితాల వ్యవహారంలో గ్లోబరీనా పేరు తెరపైకి రావడంతో సోదాలకు ప్రాధాన్యత సంతరించున్నాయి.
2019 ఇంటర్ ఫలితాల డేటా ప్రాసెసింగ్, టెండర్ ప్రక్రియపై కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపట్టారు అధికారులు. 2019 ఇంటర్ ఫలితాల వ్యవహారంలో గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో దర్యాప్తు చేపట్టారు విజిలెన్స్ అధికారులు.