Reading Time: 2 minutes

రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోవడం సహజం. ఆరోగ్యంగా ఉండటానికి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి సమయంలో మనసుకు తక్షణ ఉపశమనం అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ ఆసక్తికర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జాజెన్’ – ఆలోచనలను అదుపు చేసే ధ్యానం: ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చి మనసు ప్రశాంతతను దెబ్బతీస్తుంటాయి. దీనిని అదుపు చేయడానికి జపాన్‌లో ‘జాజెన్’ (Zazen) అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు. ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్లను సగం మూసి కూర్చోవాలి.ఇక  మనసులోకి వచ్చే ఆలోచనలను మంచి, చెడు అని విశ్లేషించకుండా కేవలం గమనిస్తూ, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది.

Japanese Ways to Relax Your Mind: Simple Techniques You Can Try
Japanese Ways to Relax Your Mind: Simple Techniques You Can Try

కింట్సుగి’ – లోపాలను అంగీకరించే కళ: చాలామంది తమలోని లోపాల గురించే ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంటారు. కానీ జపనీస్ సంస్కృతిలోని ‘కింట్సుగి’ (Kintsugi) భావన ప్రకారం మన లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలి. ఇక జపాన్‌లో పగిలిన వస్తువులను పడేయకుండా మరింత అందంగా అతికిస్తారు. అలాగే మనలోని లోపాలను కూడా మన ప్రత్యేకతగా భావిస్తే సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

ఒటెరా థెరపీ’ – ప్రశాంత వాతావరణంలో సమయం: ఒత్తిడి పెరిగినప్పుడు మనసారా ప్రశాంతంగా గడపడానికి జపనీయులు ‘ఒటెరా థెరపీ’ (Otera Therapy) అనుసరిస్తారు. అక్కడ బౌద్ధ దేవాలయాలకు వెళ్లి కూర్చోవడం, ధ్యానం, యోగా చేయడం ద్వారా రోజువారీ ఆందోళనల నుంచి ఉపశమనం పొందుతారు. ఇక ఇది తమను తాము అర్థం చేసుకోవడానికి, జీవితంలో ఏవి ముఖ్యమో, ఏవి అనవసరమో ఆలోచించుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

మానసిక ప్రశాంతత అనేది బయటెక్కడో లభించేది కాదు, అది మన ఆలోచనా విధానంలోనే ఉంటుంది. జపనీయులు పాటించే ఈ సులువైన మార్గాలను మన రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఒత్తిడిని జయించి, మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంచుకోవచ్చు.

The post మైండ్ రిలాక్స్ కావాలంటే జపనీస్ పద్ధతులు బెస్ట్.. మీరు ట్రై చేశారా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.