Reading Time: < 1 minute

తేళ్ల జాతర.. ఆ గ్రామంలో వింత ఆచారం.. తేళ్లను శరీరంపై పాకించుకుంటారు

Caption of Image.

సాధారణంగా మనం తేలు కనపడిందంటే చాలు భయపడతాం కదా.. పట్టుకోవడానికి జంకుతాం.. అలాంటి ఈ గ్రామస్తులు.. తేళ్లను పట్టుకోవడమేకాదు.. శరీరంపై పాకించుకుంటున్నారు. అమ్మాయిలు అయితే అరచేతిలో పెట్టుకొని ఆటాడుతున్నారు. పాపిట బిల్లలా పెట్టుకుంటున్నారు. ఒకాయన అయితే  నుదుటిపై, తలపై తేలును ఉంచుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వామ్మో తేలు కాటేయదా.. వీళ్లుకు భయం లేదా .. ఎందుకలా చేస్తున్నారనేది మీ డౌట్..  కర్నాటక లోని ఓ మారుమూల గ్రామంలో గ్రామస్తులంతా  ఓప్ర్యతేకమైన రోజు ఇలా చేస్తున్నారట.. ఎందుకో తెలుసుకుందా రండి.. 

తేళ్లపంచమి.. తేళ్ల జాతర అనికూడా పిలుస్తారు.  కర్నాటకలో ని యాద్గార్ జిల్లా గురుమిట్కల్ మండలం కందుకూరు గ్రామంలో తేళ్లను దైవంగా భావించి పూజలు చేయడం అనవాయితీగా వస్తున్న ఆచారం. 

►ALSO READ | గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి : 8 వేల గుండె ఆపరేషన్ల చేసిన డాక్టర్లు చెబుతున్న 5టిప్స్ ఇవే

కందుకూరూలో   సోమవారం (ఆగస్టు17) ఈ జాతర జరుపుకున్నారు  గ్రామంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని  అక్కడేఉన్న తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.ఆ తర్వాత కొండపై ఆలయం పరిసరాల్లో ఏ చిన్న రాయిని తొలగించినా తేళ్ల కనిపించాయట. తేళ్లను పట్టుకోవడం అమ్మవారి అనుగ్రహం భావిస్తారు కందుకూరు ప్రజలు. 

చిన్నారులు, మహిళలు, పురుషులు  అనే తేడా లేకుండా తేళ్లను చేతిలోకి తీసుకొని శరీర భాగాలపై పెట్టుకొని సందడి చేశారు. అయితే చాలామందికి తేళ్లు శరీరంపై పెట్టుకుంటే కుట్టవా అని డౌట్ రావొచ్చు.. గుట్టపై ఉండే వాతావరణ, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతాయని కొందరు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.