బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,59,270కి చేరుకుంది. ఒక్కరోజే రూ.4300 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,46,000 పలుకుతుండగా.. ఇవాళ రూ.3950 హైక్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 24 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 వద్ద ట్రేడవుతుండగా.. గురువారం రూ.2180 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000గా ఉండగా.. నేడు రూ.2 వేలు పెరిగి నిరాశకు గురి చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,420గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,150 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలు ప్రస్తుతం పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగి షాకిచ్చింది.
హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. గురువారం రోజే ఒకేసారి రూ.10 వేలు పెరిగింది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది.




