
మీరు డైట్‌లో ఉండి, కారంగా, ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీ కోసం చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే.అదే నార్త్ ఇండియాలో ఫేమస్ అయిన నల్ల శనగల చట్నీ.. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే నల్ల శనగల చట్నీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
- నల్ల శనగలు: 1 కప్పు (నానబెట్టినవి)
- పల్లీ నూనె: 1 పెద్ద చెంచా
- వెల్లుల్లి రెబ్బలు: 8 నుండి 10
- అల్లం: 1 అంగుళం ముక్క
- పచ్చిమిర్చి: 4
- నల్ల ఉప్పు : ½ చిన్న చెంచా
- సాధారణ ఉప్పు: రుచికి తగినంత
- కొత్తిమీర: గుప్పెడు
- నిమ్మరసం: 1 పెద్ద నిమ్మకాయది
- నీళ్లు: రుబ్బుకోవడానికి సరిపడా
తయారీ విధానం
స్టె్ప్-1: నల్ల శనగల పచ్చడి ఇంట్లోనే తయారు చేయడానికి ముందు స్టవ్ పై పాన్ పెట్టి ఒక పెద్ద చెంచా నూనె వేడి చేయండి. అందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి కొన్ని సెకన్లు వేయించండి. తర్వాత నానబెట్టిన నల్ల శనగలు వేసి మధ్యస్థ మంటపై 3–4 నిమిషాలు వేయించి, స్టవ్ ఆపి చల్లారనివ్వండి.
స్టెప్-2: ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అందులో నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, తాజా కొత్తిమీర, అవసరమైనంత నీరు పోసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోండి. రుబ్బిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో నిమ్మరసం, ఒక చిన్న చెంచా పచ్చి ఆవనూనె వేసి బాగా కలపండి. అంతే ఘాటైన, రుచికరమైన నల్ల శనగల పచ్చడి సిద్ధం అయినట్టే. దీనిని వేడివేడి పరోటాలు, పూరీ, రొట్టె లేదా అన్నంతో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుందంతే.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.