
నిర్మల్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎంఆర్ ధాన్యం ఎగవేత ఇష్యూలో ఖానాపూర్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కాగా, సత్తేన్నపల్లిలో ఎఆర్ఎస్ రైస్ మిల్లుకు రేఖా నాయక్ యజమానిగా ఉన్నారు. ఈ మిల్లు నలబై కోట్ల విలువైన తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని ఎగవేసింది.
ఈ వ్యవహారంలో రేఖా నాయక్‌కు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, నోటీసులకు ఆమె స్పందించలేదు. దీంతో అధికారులు రేఖా నాయక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల కంప్లైంట్ మేరకు ఖానాపూర్ పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.