Reading Time: < 1 minute
పాప్‌కార్న్ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

సినిమా థియేటర్‌కు వెళ్లినా, ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతున్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే మొదటి స్నాక్ కార్న్. దీనిని కేవలం టైమ్‌పాస్ స్నాక్‌గా మాత్రమే చాలామంది భావిస్తారు. అయితే సరైన పద్ధతిలో తయారు చేసుకుని తింటే ఇది శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించే అద్భుతమైన ఆరోగ్య సంరక్షణిగా మారుతుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొక్కజొన్న గింజలతో తయారయ్యే పాప్‌కార్న్‌లో ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్.మక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పాప్‌కార్న్‌తో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణవ్యవస్థకు కొండంత అండ: ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ ‘క్లీవ్‌ల్యాండ్ క్లినిక్’ నివేదికల ప్రకారం.. పాప్‌కార్న్‌లో పీచు పదార్థంసమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరించి, జీర్ణక్రియను చురుగ్గా ఉంచుతుంది.

బరువు నియంత్రణలో మేటి: ఇందులో ఉండే డైటరీ ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. తక్కువ కేలరీలతోనే కడుపు నిండిన అనుభూతిని కలిగించి, అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఆకలిని సమర్థవంతంగా కట్టడి చేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్‌కు రక్షణ: పాప్‌కార్న్ ఒక సంపూర్ణ ధాన్యం,ఇది ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్: శరీరంలోని అదనపు చెడు కొవ్వును బయటకు పంపడంలో పాప్‌కార్న్‌లోని ఫైబర్ ఎంతగానో తోడ్పడుతుంది, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

కణాల రక్షణకు యాంటీఆక్సిడెంట్లు: ఇందులో ‘ఫెరూలిక్ యాసిడ్’ వంటి బలమైన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి Stress), ఫ్రీ రాడికల్స్ ముప్పు నుంచి కాపాడతాయి.

థియేటర్ పాప్‌కార్న్‌తో ముప్పు తప్పదా?

పాప్‌కార్న్ సహజంగా మంచిదే అయినప్పటికీ, దాన్ని తయారుచేసే విధానం సరిగా లేకపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది.

అధిక వెన్న, ఉప్పుతో ప్రమాదం: సినిమా థియేటర్లలో, మార్కెట్ ప్యాకెట్లలో లభించే పాప్‌కార్న్‌లో అధిక మోతాదులో బటర్, సోడియం, కృత్రిమ ఫ్లేవర్లు, చక్కెర కలుపుతారు. ఇవి కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులను పెంచి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఇంట్లోనే ఎయిర్-పాపింగ్రం ఇంట్లో స్వచ్ఛమైన మొక్కజొన్న గింజలతో తక్కువ నూనెతో లేదా వేడి గాలితో (Air-popped) తయారు చేసుకునే సాదా పాప్‌కార్న్ ఆరోగ్యానికి అత్యుత్తమం.

సహజ రుచులతో ఆరోగ్యం: ఎక్కువ ఉప్పు, వెన్నలకు బదులుగా మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి లేదా సహజ హెర్బ్స్‌తో రుచి పెంచుకోవచ్చు.