అన్నాచెల్లెల్ల ప్రేమకు వారి మధ్య ఉండే ప్రేమకు, అప్యాయతలకు ప్రతీక రక్షాబంధన్. అయితే ప్రతి సంవత్సరం రాఖీ పండుగను శ్రావణ పౌర్ణమి తిథి రోజు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 27, 28 రెండు తేదీలు ప్రస్తావించడంతో పండుగ విషయంలో గందరగోళం నెలకొంది. మరి అసలు పండుగ ఏ రోజు జరుపుకోవాలి అనేదానిపై చాలా మందిలో స్పష్టత లేదు.
అయితే ఈ సారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 28న జరుపుకోవాలని చెబుతున్నారు పండితులు. హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27న ఉదయం 9 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9.48 గంటలకు ముగుస్తుంది. ఇక ఉదయ తిథి ప్రకారంగా చూస్తే 2026 ఆగస్టు 28 జరుపుకుంటారు. కాబట్టి పండితులు కూడా అదే రోజు జరుపుకోవాలని చెబుతున్నారు.
అంతే కాకుండా రాఖీ కూడా సరైన సమయంలో కట్టాలి అంటారు. అందువలన ఆగస్టు 28 న ఉదయం 6.23 గంటల నుంచి 9.48 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం. ఇక సోదరీమణులు మధ్యాహ్నం 12.14 గంటల నుంచి 1.05 గంటల వరకు అభిజిత్ ముహుర్తంలో కూడా రాఖీ కట్టవచ్చునంట.
అయితే ఈ సంవత్సరం రాఖీపౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా వస్తుంది. దీంతో చాలా మంది అసలు గ్రహణం వేళ రాఖీ కట్టవచ్చా అనే అయోమయంలో పడిపోయారు. అయితే ఈ చంద్ర గ్రహణం భారత్లో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు కాబట్టి ఎలాంటి ఆందోళనలు లేకుండా ఆనందంగా ఈరోజు రాఖీ కట్టుకోవచ్చునంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




