
మహబూబాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం దగ్గర పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఐ రఘుపతి రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సీఐ విద్యార్థుల గొంతు పట్టుకోవడంతో సీఐ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి యత్నించారు. జీ.ఓ. నంబర్ 97 రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన చేశారు.
కలెక్టరేట్‌లోకి పాలిటెక్నిక్ విద్యార్థులు చొచ్చుకెళ్లారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థులను ఈడ్చి బయటకు పంపారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. పోలీసులు కలెక్టరేట్ గేట్లు బంద్ చేసి భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ రావాలంటూ కలెక్టరేట్ గేటు దగ్గర విద్యార్థులు అందోళన కొనసాగించారు.