Reading Time: 2 minutes

డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ నో సపోర్ట్.. సుమలత, జానీ తీరుపై సీరియస్!

Caption of Image.

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి అగ్గిరాజేసింది. ఇటీవల  పెద్ద దుమారం రేపిన జానీ వర్సెస్ శేఖర్ మాస్టర్ గా మారిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం ముగిసిందనుకున్నా.. మళ్లీ మొదటకు వచ్చినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఈరోజు ( ఆగస్టు 19, 2026 ) అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాప్ట్స్ ని ఆహ్వానించారు. ఈ కీలక భేటీలో 24క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణ , డ్యాన్సర్స్ అసోసియేషన్ తో నెలకొన్న విభేదాలపైనే ప్రధానంగా చర్చించారు. 

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరు పై ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సినీ పెద్దలు చెప్పినా వినకుండా ఆమె  ఉపఎన్నికలు నిర్వహించారని మండిపడ్డారు.  సుమలత ఏకపక్ష నిర్ణయాలు, వ్యవహారశైలిపై  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే  డ్యాన్సర్స్ అసోసియేషన్ కి  ఫెడరేషన్  సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో సభ్యులు సమలత తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫెడరేషన్ ఇండియాలోనే టాప్ పొజిషన్ లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదాలు కాస్త చెడ్డపేరు తెచ్చే విధంగా ఉన్నాయని వాటిపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించామని తెలిపారు. డాన్సర్స్ అసోసియేషన్  ప్రస్తుతం కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి పూర్తి సహాయ నిరాకరణ జరుగుతుందని తేల్చిచెప్పారు. వారికి ఫెడరేషన్ సపోర్ట్ ఉండదని స్పష్టం చేశారు.

Also Read : టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే

పెడరేషన్ నిర్ణయాన్ని  వ్యతిరేకించిన డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులకు తమ సహకారం ఉందడని ,  జానీ మాస్టర్ మీద ఉన్న సస్పెన్షన్ కొనసాగుతుందని అనిల్ స్పష్టం చేశారు. గతంలో ఫెడరేషన్ సమావేశంలో  చిరంజీవి , సినీ పెద్దల సూచనలతో సుమలత అందరినీ కలుపుకుపోతుంది అని చెప్పారు. కానీ ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించారు  . ఫెడరేషన్ ను లెక్క చేయని డాన్సర్స్ ప్రస్తుతం కార్యవర్గ సభ్యులకు తమ మద్దతు అనేది ఉండదు అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని  స్పష్టం చేశారు. యూనియన్ డాన్సర్స్ ఎవరికైనా సహాయం కావాలని కోరితే …వాళ్ళకు ఫెడరేషన్ సపోర్ట్ వుంటుంది తెలిపారు. మరి ఫెడరేషన్ నిర్ణయంపై డాన్సర్స్ అసోసియేషన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

©️ VIL Media Pvt Ltd.