Reading Time: < 1 minute
Yami Gautam Nayyi Navelli Movie Release Date Dussehra 2026 Amazon Mgm Studios

సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా పెళ్లైన కోడలు అడుగుపెడుతుంది.

ఎంతో పద్ధతిగా, పర్ఫెక్ట్‌గా కనిపించే ఆ కొత్త వదినపై ఆమె మరిదికి వింత అనుమానం వస్తుంది. ఆమె నిజానికి ఒక ‘మాంత్రికురాలు’ ఏమోనని భావించడంతో మొదలయ్యే సరదా గందరగోళం, నవ్వుల విందు చుట్టూ ఈ కథ నడుస్తుంది. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ ఈ చిత్రానికి సరికొత్త కథను అందించగా.. బ్లాక్‌బస్టర్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత బాధ్యతలు చేపట్టారు.  నవ్వులు, ఫాంటసీ, పండుగ వాతావరణంతో థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచేందుకు వస్తున్న ‘నయ్యి నవెల్లి’ దసరా బరిలో అక్టోబర్ 16న అలరించడానికి సిద్ధమవుతోంది.