
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘ శ్రీనివాస మంగాపురం’ . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరిచింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ నటించింది. అజయ్ భూపతి మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌ను మేళవించిన కథను తెరపై ఆవిష్కరించినా పెద్దగా సినీ ప్రియులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ అపజయానికి బాధ్యత తనదేనని దర్శకుడు ఒప్పుకున్నారు. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ ‘ శ్రీనివాస మంగాపురం’ సినిమా ఆగస్టు 20వ తేదీ నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది.
కథేంటంటే?
శ్రీను (జైకృష్ణ)కు మంగ (రాషా తడానీ) అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగ, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. అదే సమయంలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అడ్డంకిగా మారతాడు. ఇంతకీ ఈ కథలో పెద్దిరెడ్డి (శ్యామ్) ఎవరు? శ్రీను.. వాసుబాబుగా ఎలా మారాడు? శ్రీను, మంగా జీవితాల్లో ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? అనేదే మిగతా కథ..
ఈ లవ్ ఎమోషనల్ చిత్రం అమెజాన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఏకకాలంలో పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈ మూవీ ఓటీటీ వేదికపై ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోగలదో చూడాలి మరి..