Reading Time: < 1 minute

వరలక్ష్మి వ్రతం మగవారు చేయచ్చా..? చేస్తే ఎన్ని లాభాలో..!

Caption of Image.

శ్రావణమాసం అంటే గుర్తొచ్చేది పూజలు, వ్రతాలు, పండగలు. శ్రావణమాసంలో చేసుకునే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఆగస్టు 28న వరలక్ష్మి వ్రతం ఉన్న సంగతి తెలిసిందే. పదిరోజులు మాత్రమే టైం ఉండటంతో వ్రతం కోసం షాపింగ్ లో బిజీ అయిపోయారు లేడీస్. మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసేవారు వ్రత విధానం గురించి తెలుసుకుంటున్నారు. అయితే.. వరలక్ష్మి వ్రతం పెళ్ళైన ఆడవారే చేయాలా..? పెళ్లి కానివారు చేయకూడదా..? మగవారు వరలక్ష్మి వ్రతం చేయచ్చా..? వంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. మగవారు కూడా వరలక్ష్మి వ్రతం చేయచ్చని అంటున్నారు పండితులు. మగవారు వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల చాలా లాభాలున్నాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మగవారు వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే లాభాలు:

వరలక్ష్మి వ్రతం మగవారు కూడా చేయచ్చని… చాలా లాభాలున్నాయని అంటున్నారు పండితులు.ఉద్యోగం కోసం ప్రయత్నించే మగవారు వ్రతం చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుందని.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు పండితులు. అంతే కాకుండా పెళ్లి కాని స్త్రీలు కూడా వరలక్ష్మి వ్రతం చేయచ్చని అంటున్నారు.

పెళ్లి కాని స్త్రీలు వ్రతం చేస్తే మంచి వరుడు వస్తాడని.. పెళ్ళైన స్త్రీలు వ్రతం చేస్తే భర్త క్షేమంగా ఉంటాడని అంటున్నారు పండితులు. పెళ్ళైన స్త్రీలు మొదటిసారి వ్రతం చేసేటప్పుడు పుట్టింట్లో చేయడం మంచిదని… కుదరని పక్షాన బంధువుల ఇళ్లలో చేయడం మంచిదని అంటున్నారు.

కాబట్టి వరలక్ష్మి వ్రతం కేవలం ఆడవారికే అన్న అపోహ వీడాలని… మగవారు కూడా వ్రతం చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందచ్చని అంటున్నారు పండితులు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
 

©️ VIL Media Pvt Ltd.