
హైదరాబాద్ అంటే… సాఫ్ట్ వేర్ ఆఫీసులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మెట్రో.. ఠక్కున గుర్తొచ్చేది ఇవే కదా..! కానీ.. ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం మారచ్చు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో దోమల దండు దండయాత్ర చేస్తోంది. పది, ఇరవై కాదు.. ఏకంగా వేల కొద్దీ దోమలు టవర్ల లాగా నెల మీద నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్లు ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లంగర్ హౌస్ లోని ఓ చెరువు దగ్గర తీసినట్లు ఉంది ఈ వీడియో. గుంపులు గుంపులుగా దోమలు స్వైర విహారం చేస్తున్నట్లుంది. ఈ వీడియో కింద రకరకాల కామెంట్స్ తో రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. హైదరాబాద్ లాంటి సిటీలో ఇదేం దుస్థితి అంటూ నెటిజన్ కామెంట్ చేయగా… జీహెచ్ఎంసీ అధికారులు నిద్రపోతున్నారా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ రేంజ్ లో దోమలు ఉంటే లంగర్ హౌస్ జనాలు ఎలా భరిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తునాన్రు నెటిజన్స్.
Mosquito Menace Reported in #LangerHouz
A resident of Langer Houz area of #Hyderabad has recorded a video showing a large number of #mosquitoes swarming around the area.
The resident raising concerns among locals about sanitation and mosquito-breeding conditions.
The video has… pic.twitter.com/rME7gyPYOL
— BNN Channel (@Bavazir_network) August 19, 2026
హైదరాబాద్ లో దోమల బెడద ఇదేం కొత్త కాదు.. గతంలో నిజాంపేట్, ప్రగతి నగర్ లాంటి ఏరియాల్లో కూడా దోమల బెడదకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి, అధికారులు ఇకనైనా ఈ సమస్యపై దృష్టి పెట్టి దోమల బెడద న ఉంచి సిటీ వాసులకు రక్షణ కల్పిస్తారా లేదా చూడాలి.