Reading Time: 2 minutes

కాశ్మీర్‌‌‌‌ భారత్దే.. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయబారి కీలక వ్యాఖ్యలు

Caption of Image.
  • ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమెరికా ప్రతినిధి తొలి పర్యటన

భారత్‌‌లో జమ్మూకాశ్మీర్‌‌ ఎంతో ముఖ్యమైన భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన సీఎం ఒమర్‌‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. 15 ఏండ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌‌ ముఖ్యమంత్రితో అమెరికా రాయబారి భేటీ కావడం ఇదే తొలిసారి.    

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో ముఖ్యమైన భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ముఖ్యమంత్రి ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటనపై  హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. జమ్మూకశ్మీర్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంతో కీలకమైన భాగం. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. 

ఇది అద్భుతమైన, అత్యంత అందమైన ప్రదేశం”అని కొనియాడారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరును తోసిపుచ్చుతూ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదనకు మద్దతు పలికేలా యూఎస్ రాయబారి వ్యాఖ్యలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అమెరికా రాయబారి ఒకరు జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 

ట్రావెల్ అడ్వైజరీ సడలింపునకు హామీ

ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా విధించిన లెవెల్-4  ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ సడలింపుపై గోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సానుకూల ప్రకటన చేశారు. ‘‘ఈ ప్రాంతంలో భద్రతను మెరుగుపరిచేందుకు బలమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడి పరిస్థితులను బట్టి ప్రయాణ హెచ్చరికలను ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తాం. ఎంతోమంది అమెరికన్లు ఇక్కడి అందాలను, అవకాశాలను వీక్షించేందుకు ఇష్టపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.  

కాగా, ముఖ్యమంత్రి ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లాతో జరిగిన భేటీలో పర్యాటకం, ఉద్యానవన రంగం, ఆర్థిక భాగస్వామ్యం తదితర అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. రానున్న రోజుల్లో అమెరికా-–జమ్మూ కాశ్మీర్ మధ్య సంబంధాలు మరింత విస్తృతం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మన సమస్యలను అమెరికా పరిష్కరించదు.. కేంద్ర ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. అందుకే పరాయి దేశాల రాయబారుల వద్ద ఫిర్యాదు చేయడం నాకు అలవాటు లేదు’’ అని ఒమర్ పేర్కొన్నారు. 

దాదాపు 15 ఏండ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్యమంత్రితో అమెరికా రాయబారి భేటీ ఇదే కావడం విశేషం. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన అనంతరం సెర్గియో గోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం లఢఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించనున్నారు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత యూఎస్ రాయబారి ఇక్కడికి వెళ్లడం కూడా ఇదే తొలిసారి.

©️ VIL Media Pvt Ltd.