Reading Time: < 1 minute

నెక్ట్స్ పరకాల ఎమ్మెల్యే నేనే.. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‎గానైనా పోటీచేస్తా: కొండా సుస్మిత

Caption of Image.

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్ట్స్ పరకాల ఎమ్మెల్యే తానేనని.. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‎గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. బుధవారం (ఆగస్ట్ 19) తన జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కేక్ కట్ చేశారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కళ్లు నెత్తికెక్కాయా అని హాట్ కామెంట్ చేశారు. 

తెలంగాణకు సీఎం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డా.. రేవంత్ రెడ్డా అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్‎లో అచ్చమైన కాంగ్రెస్‎కు పచ్చ కాంగ్రెస్‎కు మధ్య పోటీ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడంలో తన తండ్రి కొండా మురళీ సహకారం ఉందన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాగానే తమ ఇంటికి వచ్చాడని గుర్తు చేశారు.

 కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. కానీ పదవి ఇవ్వలేదు. కొండా మురళీకి హామీ ఇవ్వలేదని దేవుని మీద రేవంత్ ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. కొండా మురళి మూములు లీడర్ కాదని.. ఆయన కింగ్ మేకర్ అని అన్నారు. డైపర్లు వేసుకుని తిరిగే రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు.

ALSO READ : టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే..

 దమ్ముంటే రేవూరి చేత రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వస్తాడా.. ఆయన బాబు వస్తాడా వచ్చి రేవూరి తరఫున ప్రచారం చేయండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా జోలికి వస్తే అందరి బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. 
 

©️ VIL Media Pvt Ltd.