
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన స్వభావం ఉంటుంది. కొందరు త్వరగా కోపపడితే, మరికొందరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే, కొన్ని రాశుల వారు సాధారణంగా చాలా సహనంగా, ప్రశాంతంగా ఉంటారు కానీ.. ఒక్కసారి వారికి కోపం వచ్చిందంటే మాత్రం వారి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ 3 రాశుల వివరాలు ఏవంటే :
1. కర్కాటక రాశి:
వీటి స్వభావం బయటకు చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ అది వారి బలహీనత కాదు. ఎలాంటి పరిస్థితులనైనా తమ తెలివితో సెట్ చేయగలరు. వారికి విషయాలను ఆలోచించి, అర్థం చేసుకునే బలమైన సామర్థ్యం ఉంటుంది
వీరికి త్వరగా కోపం రాదు. వచ్చినా గొడవలు కాకుండా శాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఓపిక నశించి కోపం వస్తే మాత్రం అందరి ముందూ వారి ఆగ్రహాన్ని చూపిస్తారు. ఆ సమయంలో వీరిని శాంతపరచడం ఎవరి వల్లా కాదు.
2. మకర రాశి:
వీరు చాలా పట్టుదల గలవారు. వీరి స్వభావం లక్ష్య సాధన కోసం నిశ్శబ్దంగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
వీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో దిట్ట. ఎంత పెద్ద సమస్యనైనా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరిస్తారు. కానీ, వీరి మంచి తనాన్ని ఆసరాగా చేసుకుని పదేపదే రెచ్చగొడితే మాత్రం సహనం కోల్పోతారు. ఒక్కసారి కోపం వస్తే ఎదుటివారితో ఉన్న ఎలాంటి సంబంధాలనైనా శాశ్వతంగా తెంచుకుంటారు.
3. మీన రాశి:
పన్నెండు రాశులలో చివరిదైన ఈ రాశి వారికి ఊహాశక్తి, ముందుచూపు ఎక్కువ. వీరికి గురు గ్రహం అధిపతి కావడం వల్ల మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా చిటికెలో పరిష్కరించి, కోపాన్ని త్వరగా కంట్రోల్ చేసుకుంటారు. వీరికి అరుదుగానే కోపం వస్తుంది, కానీ ఒక్కసారి ఆగ్రహం తెచ్చుకుంటే మాత్రం వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు.
గమనిక: ఒకే రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇవే లక్షణాలు వంద శాతం ఉంటాయని చెప్పలేం, అయితే వ్యక్తులను బట్టి కొద్దిగా మారవచ్చు.