Reading Time: < 1 minute

కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీం కోర్టు

Caption of Image.

ఢిల్లీ: ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల లాఠీఛార్జ్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేసింది.

శాంతియుత, చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం సంపూర్ణంగా కల్పించిందని, అది శాంతియుతమైన ఆందోళన అయినంత వరకు లాఠీ ఛార్జ్ సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 

ఆందోళనల్లో ఏదైనా అరాచకం జరిగితే, దానిని స్వతంత్రంగా విచారించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూచించారు. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన విషయం మాత్రమే కాదని, నియమ నిబంధనలలో ఏకరూపత అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేవలం అక్కడ ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీఛార్జ్ చేయకూడదని, ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రమశిక్షణ అంతర్భాగమని సీజేఐ సూర్యకాంత్ పోలీసులకు గుర్తుచేశారు.

©️ VIL Media Pvt Ltd.