July 16, 2026

ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో తొమ్మిదో స్థానానికి అక్షర్ పటేల్

ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో తొమ్మిదో స్థానానికి అక్షర్ పటేల్
Reading Time: < 1 minute

ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో తొమ్మిదో స్థానానికి అక్షర్ పటేల్

Caption of Image.

దుబాయ్‌‌: టీమిండియా స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ అక్షర్‌‌ పటేల్‌ ఐసీసీ ర్యాంకింగ్‌‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం విడుదల చేసిన ఆల్‌‌రౌండర్స్‌‌ ర్యాంకింగ్‌‌లో అక్షర్‌‌ (213) మూడు ప్లేస్‌‌లు ఎగబాకి 9వ ర్యాంక్‌‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లతో పాటు 57 రన్స్‌‌ చేయడం అక్షర్‌‌ ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. బ్యాటింగ్‌‌లో 18 ప్లేస్‌‌లు మెరుగుపడి 73వ ర్యాంక్‌‌కు, బౌలింగ్‌‌లో రెండు ప్లేస్‌‌లు ఎగబాకి 42వ ర్యాంక్‌‌కు చేరాడు. 

కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (803) రెండో ర్యాంక్‌‌లో మార్పు లేకపోయినా 12 ర్యాంకింగ్‌‌ పాయింట్లు అతని ఖాతాలో చేరాయి. విరాట్‌‌ కోహ్లీ (757), రోహిత్‌‌ శర్మ (744) మూడు, నాలుగు ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌‌లో బుమ్రా 24వ ర్యాంక్‌‌కు చేరాడు. ఆల్‌‌రౌండర్‌‌  వాషింగ్టన్‌‌ సుందర్‌‌ బ్యాటింగ్‌‌లో 177వ, ఆల్‌‌రౌండర్ల లిస్ట్‌‌లో 55వ ర్యాంక్‌‌లో కొనసాగుతున్నాడు. 
 

©️ VIL Media Pvt Ltd.