Gold Price: అలర్ట్.. మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందో తెలుసా..?

గత కొంత కాలంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకెళ్లి.. సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు.. తగ్గుముఖం పట్టాయి.. బులియన్ మార్కెట్‌లో తగ్గినట్లే తగ్గుతూ.. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు, బుధవారం మళ్లీ పెరిగాయి.. ఒక్కరోజే పదిగ్రాముల బంగారంపై రూ.770 మేర ధర పెరిగింది. జులై 16 గురువారం పలు వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,43,580 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,31,610 గా ఉంది.
వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.2,34,900 లు గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,580, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,580, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,730, 22 క్యారెట్ల ధర రూ.1,31,760 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,580, 22 క్యారెట్ల ధర రూ.1,31,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,790, 22 క్యారెట్ల ధర రూ.1,31,810 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,580, 22 క్యారెట్ల ధర రూ.1,31,610 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..