Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!

Ashleigh Gardner Accused Of Having Affair With Teammate Georgia Voll: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన కొద్ది రోజులకే.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ అష్లీ గార్డ్నర్‌పై ఆమె భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్ మరో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జార్జియా వోల్‌తో ఎఫైర్ పెట్టుకుని.. తనను మోసం చేసిందని మోనికా సోషల్ మీడియాలో పేర్కొంది. గార్డ్నర్ సతీమణి చేసిన ఈ వివాహేతర సంబంధ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయి.
డైలీ మెయిల్ కథనంతో మొదలైన వివాదం:
ముందుగా బ్రిటిష్ మీడియా సంస్థ ‘డైలీ మెయిల్’ అష్లీ గార్డ్నర్ ఎఫైర్ గురించి తమ కథనంలో రాసింది. గార్డ్నర్ వివాహ బంధం విచ్ఛిన్నమైందని, మరో మహిళా క్రికెటర్‌తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని పేర్కొంది. అయితే డైలీ మెయిల్ ఆ కథనంలో ఆ మహిళా క్రికెటర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ వార్త ప్రచురితం అయిన కొద్ది గంటలకే మోనికా రైట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జార్జియా వోల్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘డైలీ మెయిల్ కథనం చాలా అస్పష్టంగా ఉంది. ఈమే కారణంగానే నా కాపురం కూలింది’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయింది. మోనికా పోస్టుతో గార్డ్నర్ ఎఫైర్ బయటపడింది.
ప్రపంచకప్ సమయంలోనే విభేదాలు:
డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ఈ ఏడాది భారత్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ సందర్భంగా గార్డ్నర్-మోనికా దాంపత్యంలో విభేదాలు మొదలయ్యాయి. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో గార్డ్నర్‌ను చూసేందుకు మోనికా ఇండియాకు వచ్చింది. ఆ సమయంలో గార్డ్నర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఆష్లే మోనికాతో సరిగ్గా మాట్లాడలేదు. తన వెడ్డింగ్ రింగ్‌ను కూడా ఆష్లే పక్కన పెట్టిందని మోనికా వేరే వారి ద్వారా తెలుసుకుంది. టోర్నీ ముగిసిన తర్వాత సిడ్నీకి చేరుకున్న అనంతరం గార్డ్నర్ తమ బంధంలో మార్పు వచ్చిందని మోనికాకు చెప్పింది. ఆ సంభాషణతో వారి వివాహ బంధం ముగిసింది.
పెళ్లి ఉంగరాలు వదిలేసి:
గత నవంబర్‌లో గార్డ్నర్ సిడ్నీలోని తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ సమయంలో పెళ్లి ఉంగరాలను ఇంట్లో వదిలేసిందని సమాచారం. విడిపోవడానికి ముందు గార్డ్నర్, మోనికా పిల్లల్ని ప్లాన్ చేసే ఆలోచన కూడా చేశారట. ఈ వ్యవహారం ఆస్ట్రేలియా మహిళల జట్టులో కూడా చర్చనీయాంశంగా మారిందని, కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ మోనికాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు డైలీ మెయిల్ కథనంలో పేర్కొంది. ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించగా.. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. గార్డ్నర్‌ను కూడా మీడియా సంప్రదించినప్పటికీ.. ఆమె ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అలాగే జార్జియా వోల్ కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు.
2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం:
ఆష్లే గార్డ్నర్, మోనికా రైట్ 2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమ్యారు. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరు అమ్మాయిలు.. 2025 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి గార్డ్నర్, మోనికా విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు మోనికా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో అసలు విషయం బయటపడింది.
టీమ్‌లో కీలక ప్లేయర్:
29 ఏళ్ల అష్లీ గార్డ్నర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక ఆల్‌రౌండర్. ఈ ఏడాది ఆమెను వైఎస్ కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఆమె గెలుచుకుంది. మరోవైపు జార్జియా వోల్ కూడా ఆస్ట్రేలియా జట్టులో కీలక బ్యాటర్‌గా గుర్తింపు పొందింది.