July 14, 2026

జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మీ రాశికి ఇలా..?

జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మీ రాశికి ఇలా..?
Reading Time: 3 minutes
జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మీ రాశికి ఇలా..?

దిన ఫలాలు (జూలై 14, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మిథన రాశి వారికి కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తల పెట్టిన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త లక్ష్యాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు అధిక లాభాలతో పురోగమిస్తాయి. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలతో ప్రయో జనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. విద్యార్థులు ఆశించిన పురోగతిసాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటాపని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండకపోవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లల చదువుల విష యంలో శుభ వార్తలు వింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమి త్రులు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇత రులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి మార్గాలు విస్తరిస్తాయి. వృథా ఖర్చుల విష యంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబసమే తంగా ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ముఖ్య మైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దా నాలు చేయవద్దు. ఎవరికీ ఉచితంగా సహాయాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. కుటుంబ బాధ్యతలు పెరు గుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకో వడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. మిత్రులకు సహాయం చేయడం జరుగు తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభ వార్త వినడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

Also Read: మీ టైమ్ వచ్చేసింది భయ్యా.. గజకేసరి రాజయోగంతో ఇక వారి దశ తిరిగినట్టే..!

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జ్యోతిష్య విశ్వాసాలు, అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించాలి)