
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ వాతావరణం మిన్నంటింది. వీధివీధినా గణపతి మండపాలు, ప్రతి ఇంట్లో పూజలు, మోదకాల నైవేద్యాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరూ విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రీల్ లైఫ్‌లో ఎంతో బిజీగా ఉండే సినీ తారలు షూటింగ్‌లకు విరామం ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో సెలబ్రిటీల వినాయక చవితి సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ చిరంజీవి అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని.. ప్రతి మంచి కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు కుమార్తెలు,మనవరాళ్లు, మనవళ్లతో కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.
May Lord Ganesha always bless you and your family with happiness, peace, and prosperity ❤️
వినాయక చవితి శుభాకాంక్షలు ✨ pic.twitter.com/5qlLeoAdIU
— Ram Charan (@AlwaysRamCharan) September 14, 2026
మెగా ఫ్యామిలీలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా తమ కుమారుడు వాయువ్ తేజ్‌తో కలిసి గణపతికి పూజలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ దంపతులు మెరిసిపోగా.. చిన్నారి వాయువ్‌తో కలిసి ఉన్న కుటుంబ ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి.
Wishing everyone a blessed and joyful Vinayaka Chavithi. May Lord Ganesha’s blessings always be with you and your entire family..
Love.❤️ pic.twitter.com/aji0P5hpL5
— Varun Tej Konidela (@IAmVarunTej) September 14, 2026
సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ నివాసాల్లో గణపతి బప్పా మోరియా నినాదాలు మార్మోగాయి. మాజీ మంత్రి, నటి రోజా సెల్వమణి తన కుటుంబంతో కలిసి నిష్టతో పూజలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించగా.. నటి స్నేహా చీరకట్టులో మెరిసిపోతూ పూజా విశేషాలను షేర్ చేశారు.
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పండగను ఘనంగా జరుపుకున్నారు. అనన్య పాండే కుటుంబంతో కలిసి పూజలు చేయగా, రితేష్ దేశ్‌ముఖ్–జెనీలియా దంపతులు తమ ఇంటి గణపతి వేడుకలను పంచుకున్నారు. కాజోల్, సునీల్ శెట్టి, శర్వరి, తుషార్ కపూర్ తదితరులు కూడా గణపతి బప్పాను తమ ఇళ్లకు ఆహ్వానించారు.
►ALSO READ | Samantha Seemantham : సమంత సీమంతం వేడుక.. ఆచారాలపై సామ్ ఎమోషనల్ నోట్!
మృణాల్ ఠాకూర్, హన్సిక, రాకుల్ ప్రీత్ సింగ్ – జక్కీ భగ్నానీ జంట, గుర్మీత్ చౌదరి-దేబినా దంపతులు తమ ఇళ్లలో విఘ్నహర్తను ప్రతిష్టించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ లోకమంతా ఇప్పుడు విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో పండగ కాంతుల్లో మెరిసిపోతోంది..
మొత్తానికి సినిమా షూటింగులు, బిజీ షెడ్యూల్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. సెలబ్రిటీలు కుటుంబంతో కలిసి గణనాథుడి ఆశీస్సులు అందుకోవడంతో ఈ ఏడాది కూడా సినీ తారల వినాయక చవితి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు అభిమానులకు పండగ సందడిని మరింత పెంచుతున్నాయి. గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా అంటూ విషెస్ చెబుతున్నారు.