Reading Time: 2 minutes

Samantha Seemantham : సమంత సీమంతం వేడుక.. ఆచారాలపై సామ్ ఎమోషనల్ నోట్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈసారి సినిమా, గ్లామర్ లేదా కెరీర్ అప్‌డేట్‌తో కాదు.. ఓ ప్రత్యేకమైన సంప్రదాయ వేడుకతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.  లేటెస్ట్ గా సమంత సీమంతం వేడుక ఘనంగా జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను  సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. అయితే ఫొటోల కంటే ఆమె రాసిన సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. మరింత చర్చనీయాంశంగా మారింది.

భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఆశీర్వాధం తీసుకున్న సమంత ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ రాశారు. “మన సంప్రదాయాల పట్ల నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం పూర్తిగా తెలియకపోయినా.. మంత్ర ధ్వనిలో, జపం ద్వారా పుట్టే శక్తిలో, తరతరాలుగా జాగ్రత్తగా కొనసాగుతున్న ప్రాచీన ఆచారాల్లో ఏదో లోతైన శక్తి ఉందని నమ్ముతాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన శ్రీ కల్పం  గురించి కూడా ఆమె వివరించింది. శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఈ ప్రత్యేక ఆచారంలో దేవి 94 కళలను స్మరిస్తూ.. తల్లి శరీరంలోని ఏడు చక్రాలను మంత్రాలు, పవిత్ర జలంతో శుద్ధి చేసి శక్తివంతం చేసే విధానాన్ని వివరించింది.

ఇందులో తనను కేవలం తల్లిగా కాకుండా “దేవి స్వరూపంగా, మరో ప్రాణికి జన్మనిచ్చే పవిత్ర సృష్టికర్తగా” గౌరవించడం తనను ఎంతో కదిలించిందని సమంత తెలిపింది. శ్రీచక్ర యంత్రం, తొమ్మిది ఆవరణలు, బిందువు, లలితా త్రిపురసుందరి భావన, దేవి ఖడ్గమాల పఠనం వంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది. ముఖ్యంగా పుట్టకముందే బిడ్డకు మంత్రాల ద్వారా ఓ పవిత్రమైన సంస్కారం, రక్షణ, ఆశీర్వాదం అందుతుందనే భావన తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పింది.

►ALSO READ | వినాయక చవితి పూజలో జంటగా.. పెళ్లి పీటలెక్కనున్న తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా?

ఈ సీమంతం వేడుక గురించి దాదాపు ఏమీ తెలియకుండా వెళ్లాను.. కానీ అక్కడి నుంచి ఎంతో ఆశీర్వాదం, రక్షణ భావనతో తిరిగి వచ్చాను అంటూ సమంత తన అనుభూతిని పంచుకుంది. ఈ అందమైన వేడుకను అనుభవించే అవకాశం కల్పించిన తన సన్నిహితురాలు శిల్పారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ ఫొటోలు బయటకు రావడంతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత సీమంతం ఫొటోలు, ఆమె చెప్పిన సంప్రదాయాల విశేషాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి..

 

©️ VIL Media Pvt Ltd.