Reading Time: < 1 minute

ముత్యం ధారకు వెళ్లిన హైదరాబాద్ పర్యాటకులకు రూ.10 వేల జరిమానా

Caption of Image.

ములుగు జిల్లా: వెంకటాపురం మండలంలోని నిషేధిత ముత్యం ధార జలపాతానికి గుట్టుగా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు పర్యాటకులకు అటవీశాఖ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు.పర్యాటకులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ క్రమంలో మార్గమధ్యలో జహీరాఖాన్ అనే పర్యాటకుడు అస్వస్థతకు గురికావడంతో అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రి వద్ద కూడా పర్యాటకులు అధికారులతో మరోసారి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం ఏడుగురు పర్యాటకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

నిషేధిత జలపాతాలు, ప్రమాదకర ప్రాంతాల వద్దకు పర్యాటకులు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

►ALSO READ | పూరి జగన్నాథ్ ఆలయ నమూనాలో… బాలాపూర్ గణేష్ మండపం స్పెషల్ అట్రాక్షన్… 

©️ VIL Media Pvt Ltd.